![]() |
![]() |

బిగ్ బాస్ అగ్ని పరీక్షలో డబ్బా రేకుల రాణి అలియాస్ శ్రీజ ఐతే బీభత్సం సృష్టించింది. విశాఖపట్నం నుంచి శ్రీజ వచ్చింది. అసలు మాములు వాగుడు కాదు. బాబోయ్ రావడమే స్టేజి మీద అరుస్తూ అందరినీ షాకయ్యేలా చేసింది. దమ్ము చూపిస్తా దుమ్ము రేపుతా అని అదేపనిగా వసపిట్టలా వాగుతూనే ఉంది. జడ్జెస్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు. "మీకంటే బాగా ఎంటర్టైన్ చేయగలను...మీకు కంటెంట్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి అవన్నీ నేను చేయగలను...బిగ్ బాస్ కి నన్ను ఎందుకు పంపాలో నేనే చెప్పేస్తున్నా..అభిజిత్ గారు అంతా మైండ్ లో స్ట్రాటజీస్ అవీ వేసి ఆడవాళ్లు...ఫిజికల్ గేమ్స్ ఎప్పుడూ ఆడలేదు. కానీ నేను ఫిజికల్ గా కూడా ఆడతాను .. స్మార్ట్ గా కూడా ఆడగలను..ఇక ఆడపులి గారి పేరును కూడా నేను త్వరలో సొంతం చేసేసుకుంటాను...బిగ్ బాస్ ఈ సీజన్ లో నేను విన్నర్ ఐపోతాను" అంటూ గ్యాప్ లేకుండా చెప్పేసింది.
ఇక శ్రీముఖిని కూడా మాట్లాడనివ్వలేదు. "ఆల్రెడీ యాంకరింగ్ పొజిషన్ తీసేసుకున్నా నెక్స్ట్ యాంకర్ ని నేనే"అని శ్రీజ అనేసరికి రెడ్ ఇచ్చేసాడు. "మీలా కామ్ గా ఉండడం నా వల్ల కాదండి. నన్ను చూసి భయపడుతున్నారు అందుకే రెడ్ ఇచ్చారు" అని చెప్పింది. "నువ్వేం చేస్తావ్" అని నవదీప్ అడిగేసరికి తానొక సాఫ్ట్వేర్ డెవలపర్ అంటూ చెప్పింది. "ట్రోఫీ కావాలా, డబ్బులు కావాలా" అని శ్రీముఖి అడిగేసరికి రెండు కావాలి అని చెప్పింది. "నీ వాయిస్ ఇరిటేటింగ్ గా ఉందని ఎవరైనా చెప్పారా అని బిందు అడిగేసరికి అరే అందరూ డబ్బా రేకుల రాణి" అంటుంటారు అంది. "బిగ్ బాస్ కి ఎందుకు పంపాలి నిన్ను" అని నవదీప్ అడిగేసరికి "ఎందుకు పంపకూడదు ...మీకు టిఆర్పి కావాలి, మీకు కంటెంట్ కావాలి, షో మంచిగా కావాలి..నేనే టిఆర్పిని పెంచగలను ..గొడవలు పడతా ఎంటర్టైన్మెంట్ ఇస్తా" అని చెప్పింది. "ఈ పిల్ల అరుస్తోంది అని టీవీ బంద్ చేస్తారు" అని శ్రీముఖి అనేసరికి "అలా అనుకుంటే నువ్వున్నా సీజన్ టైంలోనే బంద్ చేసేవాళ్ళక్కా" అని శ్రీముఖికి కౌంటర్లు వేసింది. "నువ్వు మాట్లాడుతుంటే ఎప్పుడు ఆపేస్తుందా అనిపించేలా ఉంది కానీ ఇంటరెస్టింగ్ గా లేదు" అంటూ బిందు కూడా రెడ్ ఇచ్చింది. "బిగ్ బాస్ లో నా లాంటి వాళ్ళు కూడా ఉండాలి" అంది..."పీపుల్ వాంట్స్ థట్ అతి..అసలేమవుతుందో నాకు చూడాలని ఉంది" అని నవ్వుకుంటూ గ్రీన్ ఇచ్చాడు నవదీప్ .
![]() |
![]() |